News September 6, 2025
గణేష్ ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలి: జిల్లా ఎస్పీ

కాగజ్‌నగర్ పట్టణంలో నేడు జరగబోయే నిమజ్జన ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జన ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజలు, భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని తెలిపారు. నిమజ్జన సమయంలో తొందరపాటు పనికిరాదన్నారు.
Similar News
News September 6, 2025
తిరుపతి: పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

తిరుపతి అలిపిరి పరిధిలో ఇవాళ తెల్లవారుజామున రమ్య(6 నెలలు) మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బహిర్భూమికి ఇద్దరు కుమార్తెలను తల్లి చందన తీసుకెళ్లింది. చందన చేతిలో నుంచి రమ్య జారి కాలువలో పడింది. బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయగా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబసభ్యులకు భయపడి కనిపించడంలేదని తెలిపినట్లు సమాచారం.
News September 6, 2025
కొత్తపట్నం వద్ద విషాదం.. స్పందించిన మంత్రి!

కొత్తపట్నం మండలం గుండమాల తీరం వద్ద శనివారం మోటుమాల గ్రామానికి చెందిన నాగరాజు, బాలచందర్ మృతి చెందడంపై మంత్రి స్వామి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గుండమాల తీరం వద్ద నిమజ్జనోత్సవం సందర్భంగా వీరు మృతి చెందినట్లు సమాచారం అందుకున్న, మంత్రి స్వామి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిమజ్జనం సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోరారు.
News September 6, 2025
కొత్తగూడెం: సింగరేణిలో టెర్మినేట్ అయిన వారికి అవకాశం

సింగరేణి సంస్థలో వివిధ కారణాలతో తమ ఉద్యోగాలు కోల్పోయిన 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలకు(JMET) యాజమాన్యం మరో అవకాశం కల్పించింది. సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో టెర్మినేట్ అయిన ట్రైనీలు తిరిగి విధుల్లో చేరడానికి మార్గం సుగమమైంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో పనిచేయాలని యాజమాన్యం సూచించింది.