News August 13, 2025
గతంలో ఇబ్బందులు మరొకసారి పునరావృతం కావొద్దు: సీఎం

గత సం. ఖమ్మంలో ఎదురైన ఇబ్బందులు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఖమ్మం కార్పొరేషన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక అధికారులను నియమించి 24×7 మానిటరింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. సిబ్బంది సెలవులు రద్దు చేయాలని, ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని చెప్పారు. అటు విద్యా సంస్థలతో చర్చించి సంబంధిత శాఖ అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.
Similar News
News August 13, 2025
భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు

భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. 19001 ప్రమాణ స్థాయిలను పాటించేటటువంటి 22000 ఆహార భద్రత నిర్వహణ స్థాయి పాటించే గుర్తింపు లభించింది. మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి అందుకున్నారు. ఈ సర్టిఫికెట్‌ను ఐఎస్ఓ డైరెక్టర్ శివయ్య అందించారు.
News August 13, 2025
ఖమ్మం నగరంలో డెంగీ పంజా..!

ఖమ్మం నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క వైరల్ ఫీవర్లు.. మరోపక్క డెంగీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సీజన్ ఆరంభంలోనే 10 కేసులు నమోదయ్యాయి. KMC అధికారులు అప్రమత్తమై 21 హట్ స్పాట్‌లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాలు చేపడుతున్నారు. సీజనల్ వ్యాధులు అడ్డుకోవాలంటే ప్రజలు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
News August 13, 2025
ఖమ్మం: గంజాయి స్మగ్లింగ్.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష

గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. 2021 ఏప్రిల్ 28న జల్సాలకు అలవాటు పడిన మల్లేశ్, గడ్డం భువన్ అనే ఇద్దరు వ్యక్తులు ఖమ్మం వీవీ పాలెం వద్ద గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.