News December 18, 2025

గతేడాదితో పోలిస్తే నేరాలు తగ్గుముఖం: DGP

image

AP: గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని DGP హరీశ్ గుప్తా పేర్కొన్నారు. ‘2023-24లో 1,10,111 నేరాలు నమోదైతే 2024-25లో 1,04,095 దాఖలయ్యాయి. అల్లర్లు 52.4%, SC, STలపై నేరాలు 22.35%, స్త్రీలపై అకృత్యాలు 22.35% తగ్గాయి. 4 నెల‌ల్లో 2,483 మంది అదృశ్య‌మైన మ‌హిళ‌ల ఆచూకీ క‌నుగొన్నాం. వారిలో 1177 మంది యువ‌తులున్నారు’ అని తెలిపారు. 55% మేర రిక‌వ‌రీ రేటు సాధించామ‌ని డీజీపీ వెల్లడించారు.

Similar News

News December 27, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న మొత్తం 72,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చింది. వరుస సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది.

News December 27, 2025

టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు.. అప్లైకి 4రోజులే సమయం

image

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 4 రోజులే (DEC 31) సమయం ఉంది. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో 1,105 ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, PST/PET, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. 2026, FEB, ఏప్రిల్‌లో CBT ఉంటుంది. https://ssc.gov.in/ *మరిన్ని ఉద్యోగ వివరాలకు <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 27, 2025

AIIMS రాయపుర్‌లో 100 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు

image

<>AIIMS <<>>రాయపుర్‌ 100 Sr. రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB/డిప్లొమా ఉత్తీర్ణులు JAN 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, SC,ST, PwBDలకు ఫీజు లేదు. నెలకు రూ. 67,000+అలవెన్సులు చెల్లిస్తారు. https://www.aiimsraipur.edu.in