News January 9, 2026

గత పాలకులు ఏమీ చేయకుండా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు: పవన్

image

AP: పనిచేసే నాయకులకు అండగా నిలవాలని Dy.CM పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. గత పాలకులు ఏమీ చేయకుండా తమను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు. పిఠాపురంలో ఏ చిన్న విషయం జరిగినా దారుణం జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఏదైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలికని, నిర్మించడమే కష్టమని పేర్కొన్నారు.

Similar News

News January 10, 2026

చెరకులో బడ్ చిప్ పద్ధతి వల్ల ప్రయోజనాలు

image

బడ్ చిప్ పద్ధతిలో పెంచిన చెరకులో సాంద్రపద్ధతి కంటే ఎక్కువ పిలకలు, ఏకరీతిగా ఎదుగుదల ఉండి.. గడల సంఖ్య, గడ బరువు, చెరకు దిగుబడి, చక్కెర శాతం అధికంగా ఉంటుంది. బడ్ చిప్ మొలకల ద్వారా నీరు, నమయం, కీలక వనరులను ఆదా చేయవచ్చు. ఎక్కువ దూరంలో మొలకలను నాటడం ద్వారా అంతర పంటలు వేసుకొని అదనవు ఆదాయం పొందవచ్చు. బడ్ చిప్ సేద్యంలో యాంత్రీకరణకు సౌకర్యంగా ఉండి, రైతులకు నికర ఆదాయం ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది.

News January 10, 2026

OFFICIAL: రాజాసాబ్‌కు ఫస్ట్ డే రూ.112 కోట్లు

image

ప్రభాస్-మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ తొలిరోజు కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఏకంగా ఈ మూవీ ఫస్ట్‌డే వరల్డ్ వైడ్‌గా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. హారర్ ఫాంటసీ కేటగిరీలో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్ అంటూ ట్వీట్ చేసింది.

News January 10, 2026

దక్షిణమూర్తి పూజ

image

వ్యాపారంలో ఆటంకాలు, ఉద్యోగంలో ఒత్తిడి, పిల్లల చదువు, కెరీర్ విషయంలో గందరగోళానికి గురవుతున్నారా? అయితే దక్షిణమూర్తి స్వామిని పూజించడం వల్ల మేధస్సు పెరిగి, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. చదువు, కెరీర్, వృత్తి, వ్యాపారాల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ పవిత్ర సమయంలో స్వామి కృప కోసం మీ పేరు, గోత్రంతో పూజలో పాల్గొని విజయాలను పొందడానికి వేదమందిర్‌లో ఇప్పుడే <>బుక్ చేసుకోండి<<>>.