News January 27, 2025

గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు: కడియం కావ్య

image

గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 11, 2026

WPL: ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

image

WPLలో తన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74*), నాట్ స్కీవర్ బ్రంట్ (70) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తడబడింది. 19 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయింది.

News January 11, 2026

నిఖత్ జరీన్‌కు గోల్డ్ మెడల్

image

గ్రేటర్ నోయిడాలో (UP) జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మహ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్స్‌ సాధించారు. 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్.. 2023 ప్రపంచ ఛాంపియన్ నితూ ఘాంగాస్‌ను ఓడించి తన మూడో నేషనల్ టైటిల్‌ను గెలుచుకున్నారు. మరోవైపు హుసాముద్దీన్ 60KGల విభాగంలో సచిన్ సివాచ్‌పై విజయం సాధించారు. 75KGల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ సైతం గోల్డ్ మెడల్ సాధించారు.

News January 11, 2026

ఈ టిప్స్‌తో నిద్రలేమి సమస్యకు చెక్!

image

* ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి.
* బెడ్‌రూమ్‌లో 18-22 డిగ్రీల టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి.
* గదిలో లైటింగ్ ఎక్కువగా లేకుండా చూసుకుంటే నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది.
* కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్/ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
* విటమిన్ D, B12 లోపాలు లేకుండా చూసుకోవాలి.
* రేపటి పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆలోచనలు తగ్గి బాగా నిద్ర పడుతుంది.