News September 23, 2025

గత ప్రభుత్వం 3,116 తప్పుడు కేసులు పెట్టింది: హోం మంత్రి

image

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం3,116మందిపై తప్పుడు కేసులు పెట్టినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం శాసనమండలిలో మాట్లాడుతూ.. నిరుద్యోగులపై కేసులు పెట్టిన కారణంగా ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పర్యటించిన ప్రాంతాల్లో సంబంధిత నేతలను హౌస్ అరెస్ట్ చేసేవారని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే అరెస్ట్ చేసేవారన్నారు.

Similar News

News September 23, 2025

పోలీసు శాఖ పర్యవేక్షణలో దేవి నవరాత్రులు: సీపీ వరంగల్

image

దేవి నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో, దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠమైన భద్రత కల్పిస్తారని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, వేడుకలు జరిగే అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

News September 23, 2025

వన్డేల్లో కోహ్లీ ఆడతారా? ఆడరా?

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో AUSతో వన్డే సిరీస్‌కు ముందు AUS-Aతో ODI సిరీస్‌లో ఆడాలని రోహిత్, కోహ్లీకి BCCI సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలెట్టగా, BCCIకి కోహ్లీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని సమాచారం. దీంతో ఆయన ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ తన ఫ్యామిలీతో లండన్‌లో ఉంటున్నారు.

News September 23, 2025

పాడేరు: మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలి

image

మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంతృప్తికరమైన సేవలు అందించి, పీజీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. మ్యూటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.