News February 28, 2026

‘గద్వాలను అభివృద్ధి పథంలో నడిపిద్దాం’

image

గద్వాల జిల్లా నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ, పౌర సేవలపై ఇరువురు అధికారులు చర్చించారు. అధికారులందరి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
అభివృద్ధి పథంలో నడిపిద్దాం

Similar News

News March 2, 2026

SKLM: ‘జాతీయ లోక్ అదాలత్ వినియోగించుకోవాలి’

image

మార్చి 14న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో బ్యాంక్ అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. అధికంగా రాజీలు చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేయాలన్నారు.

News March 2, 2026

జగిత్యాల: ప్రజావాణిలో 62 ఫిర్యాదుల స్వీకరణ

image

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బి.సత్యప్రసాద్ అదనపు కలెక్టర్, ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు మొత్తం 62 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. జిల్లా అధికారులు, తహశీల్దార్లు ఉన్నారు.

News March 2, 2026

SKLM: ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకి 895 మంది హాజరు

image

జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు, అక్రమాలకు తావులేకుండా ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6 సిట్టింగ్ స్క్వాడ్లతో నిరంతర పర్యవేక్షణ చేశారన్నారు.