News March 19, 2025
గద్వాలలో దారుణం..!

గద్వాల మండలం చేనుగోనిపల్లిలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వృద్ధులపై గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. అనాథలైన వృద్ధులపై మానవమృగాలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు గద్వాల ఆసుపత్రికి తరలించారు. కాగా వృద్ధుల్లో ఒకరికి కళ్లు కనిపించవు. మరొకరికి మతిస్థిమితం సరిగా లేదు.. మానవత్వం మరిచి వృద్ధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
Similar News
News January 25, 2026
BREAKING.. రుడా పరిధిలో భూముల విలువ పెంపు

రుడా పరిధిలో భూముల మార్కెట్ విలువలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రాజమండ్రిలో ఆదివారం కలెక్టర్ మేఘ స్వరూప్ దీనిపై సమావేశం నిర్వహించారు. పెంపుపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29 లోపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలపాలని కోరారు. పెరిగిన ధరలు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు వర్తిస్తాయన్నారు.
News January 25, 2026
ఏలూరు: డ్రోన్ కెమెరాకు చిక్కిన పెద్దపులి

కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురం గ్రామ పరిసరాల్లో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం పొలాల్లో తిరుగుతున్న పులి దృశ్యాలు అధికారుల డ్రోన్ కెమెరాకు చిక్కాయి. పులిని బంధించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పులి భయంతో పనులకు వెళ్లలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.
News January 25, 2026
కడపలో ఈనెల 28న మెగా జాబ్మేళా.!

కడపలోని సంధ్యా సర్కిల్ డాన్ బోస్కో ITI కళాశాలలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 28న మెగా జాబ్ మేళా జరగనుంది. అయితే ఈ మేళాలో 25 ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. 18-35 ఏళ్లమధ్య వయస్సు కలిగి ఉండాలి. 10Th, ఇంటర్, డిగ్రీ, PG, ఐటీ విద్యార్హలు అర్హులు. మొత్తం 1080 ఉద్యోగాలు ఉన్నాయని, 28వ తేదీన ITI కళాశాలలో ఇంటర్వ్యూ జరుగుతాయని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సురేశ్ తెలిపారు.


