News September 24, 2025
గద్వాలలో రేపు బతుకమ్మ వేడుకలు

గద్వాలలోని తేరు మైదానంలో గురువారం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మహిళలు, చిన్నారులు, విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు. ఆకర్షణీయంగా బతుకమ్మ పేర్చిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ వేడుకలను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News September 24, 2025
జన్తు: ‘రక్తదానం ప్రాణదానంతో సమానం’

రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో దాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను నిలబెడుతుందని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ బి.విష్ణువర్ధన్ అన్నారు. బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా రక్త దానం చేసి విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు. 102 మంది విద్యార్థులు రక్తదానం చేశారు.
News September 24, 2025
మంథని: ‘ఫీవర్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం మంథనిలో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి ఆసుపత్రికి వచ్చే జ్వరం కేసులకు మంచి వైద్యం అందించాలని, సీజనల్ వ్యాధుల లక్షణాలున్న వారికి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. అనంతరం ఆయన జేబీఎస్ స్కూల్, బాలికల జడ్పీహెచ్ఎస్ స్కూల్, గురుకుల పాఠశాలలను సందర్శించి పరిశీలించారు.
News September 24, 2025
విశాఖలో వి-జ్యువెలరీ మార్ట్ రెండో షోరూమ్

సంపత్ వినాయక టెంపుల్ సమీపంలోని ఆశీల్ మెట్టలో వి-జ్యువెలరీ మార్ట్ రెండో షోరూమ్‌ను ప్రారంభించారు. ఇక్కడ వినూత్నమైన కలెక్షన్‌లు అందుబాటులో ఉంచామని షోరూమ్ యాజమాన్యం చెప్పింది. ప్రారంభోత్సవ ఆఫర్‌గా అన్ని రకాల 22KT బంగారు అభరణాలను మార్కెట్ ధర కన్నా తక్కువకే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆభరణాలపై తరుగు 6.96% నుంచి ఉందన్నారు. వెండి వస్తువులపై తరుగు, మజూరు లేదని.. GST కూడా తామే చెల్లిస్తున్నట్లు చెప్పారు.