News March 16, 2025

గద్వాలలో వ్యక్తి మృతి

image

ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో మానోపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అలంపూర్ చౌరస్తా నుంచి చెన్నిపాడు వైపునకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలంపూర్ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు.

Similar News

News April 5, 2026

గార: 80 ఏళ్లలో మరొకరికి వెలుగునిచ్చిన భార్యాభర్తలు

image

గార మండలంలోని శ్రీకూర్మానికి చెందిన అంధవరపు రూపవతి(82) శుక్రవారం తనువుచాలించారు. దీంతో కుటుంబ సభ్యులు నేత్రదానం చేయాలని నిర్ణయించుకున్నారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు సుజాత, పి.చిన్ని కృష్ణల ద్వారా ఆమె కార్నియాలను సేకరించారు. ఇటీవలే భర్త బాలకృష్ణ మూర్తి (88) కూడా నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచారు.

News April 5, 2026

శ్రీకాకుళం జిల్లా వాసులకు అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్ .ఎన్.పేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలలో ఆదివారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. అలాగే సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 5, 2026

అనంత జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

సీఎం చంద్రబాబు ఈనెల 6న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. ఉదయం 11:10 గంటలకు యాడికి(M) వేములపాడుకు చేరుకుంటారు. 11:30 నుంచి ఒంటి గంట వరకు ‘ప్రజావేదిక’లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:40-02:30 మధ్య పెండేకల్లు రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. 2:40-4:10 వరకు వేములపాడులో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. 4:20 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.