News October 17, 2025
గద్వాల్: ఈనెల 22 నుంచి వ్యవసాయ పరికరాలు అందజేత

ఈనెల 22వ తేదీలోపు రైతులు దరఖాస్తు చేసుకుంటే రాయితీలపై వ్యవసాయ పరికరాలు అందజేస్తామని కేటీదొడ్డి మండల వ్యవసాయ అధికారి రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఎస్టీ, ఎస్సీలతోపాటు సన్న, చిన్నకారు రైతులకు 50%, జనరల్ కేటగిరిలో 40% రాయితీ ఉంటుందన్నారు. రొటోవేటర్, కల్టివేటర్, పవర్ స్ప్రేయర్లు, బ్రష్కట్టర్, పవర్ టిల్లర్లు, బ్యాటరీ స్ప్రేయర్లతో పాటు రకరకాల పరికరాలను యాంత్రీకరణ పథకం ద్వారా అందజేస్తామన్నారు.
Similar News
News October 18, 2025
కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్‌ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.
News October 18, 2025
ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

ముంబై పోర్ట్ అథారిటీ 116 గ్రాడ్యుయేట్, COPA అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) 105, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 11 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in/
News October 18, 2025
‘కలౌ వేంకటో నాయకః’ అని ఎందుకు అంటారు?

‘కలౌ వేంకటో నాయకః’ అంటే కలియుగంలో వేంకటేశ్వరుడే నాయకుడు అని అర్థం. కలియుగపు పాపాలను శుద్ధి చేయడానికి, భవసాగరంలో మునిగిపోయే ప్రజలను రక్షించడానికి నారాయణుడు తిరుమలలో వెలిశాడు. పరమాత్మ అయిన ఆ వేంకటపతి తన దివ్య దర్శనం ద్వారానే ప్రజలకు శుభాన్ని, మోక్షాన్ని అందించడానికి విగ్రహ రూపంలో వరాహ క్షేత్రంలో స్థిరపడ్డాడు. ఆయన రాకతో ఈ క్షేత్రం పావనమైంది. ఈ విషయాన్ని వేంకటాచల మాహాత్మ్యం పేర్కొంది.<<-se>>#VINAROBHAGYAMU<<>>