News December 1, 2025

గద్వాల్: ఎయిడ్స్ బాధితుల హక్కులపై అవగాహన

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ.. హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితుల హక్కుల పరిరక్షణలో న్యాయ సేవల సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వ్యక్తులపై వివక్ష, మానసిక వేధింపులు గురించి వివరించారు.

Similar News

News April 13, 2026

NGKL: ఆర్టిజన్ల సమస్యలపై సీఎంకు ఎమ్మెల్యే లేఖ

image

విద్యుత్ సంస్థల ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2017లో గత ప్రభుత్వం కార్మికులను పర్మనెంట్ చేస్తామని ప్రకటించి మోసం చేసిందని, ఐదు నెలలుగా వారు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. వారికి వెంటనే APSEB రూల్స్ వర్తింపజేయాలని ఆయన విన్నవించారు.

News April 13, 2026

NLG: 19,898 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 296 కేంద్రాలను ప్రారంభించారు. సోమవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 4,746 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 19,898 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ కొనుగోళ్ల ద్వారా ఇప్పటివరకు జిల్లాలోని 2,290 మంది రైతులు తమ పంటను విక్రయించారు.

News April 13, 2026

SRH భారీ స్కోర్

image

IPL: RRతో మ్యాచులో SRH బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 రన్స్ చేశారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. క్లాసెన్ 40, నితీశ్ 28 పరుగులు చేశారు. ఆర్చర్ 2 వికెట్లు తీశారు. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.