News March 15, 2025

గద్వాల్: ఒంటిపూట బడులు.. ఒక్కో క్లాస్ ఎంతసేపంటే..?

image

నేటి నుంచి ఒంటిపూట బడుల నేపథ్యంలో ఒక్క క్లాస్ పీరియడ్ ఎంత సమయం ఉంటుందనే వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గం.లకు 1వ బెల్, 8:05కు 2వ బెల్, 8:15- 8:55 వరకు 1వ పీరియడ్, 8:55- 9:35 వరకు 2వ పీరియడ్, 9:35- 10:15 వరకు 3వ పీరియడ్, 10:15- 10:30 గంటలకు బ్రేక్. 10:30 గం. నుంచి 11:10 వరకు 4వ పీరియడ్, 11:10 గం. నుంచి 11:50 వరకు 5వ పీరియడ్, 11:50 గం. నుంచి 12:30 వరకు చివరి పీరియడ్‌. SHARE IT

Similar News

News November 14, 2025

అన్నమయ్య: 20 ఎర్రచందనం దుంగలు.. ఇన్నోవా సీజ్

image

అన్నమయ్య జిల్లాలోని శేషచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లపై అటవీ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన వీరబల్లి మండలం తాటిగుంటపల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. కాగా పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించి 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారని రేంజర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. దుంగలు, వాహనం విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని రేంజర్ తెలిపారు.

News November 14, 2025

కమలం జోరు.. కాంగ్రెస్ బేజారు!

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో BJP దూసుకెళ్తోంది. JDUతో కలిసి బరిలోకి దిగిన కాషాయ పార్టీ 95 సీట్లలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2020 ఎన్నికల్లో ఆ పార్టీ 74 స్థానాలు గెలవగా ఇప్పుడు ఆ సంఖ్యను భారీగా పెంచుకుంటోంది. అటు ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ బోల్తా పడింది. కేవలం 3 చోట్లే ఆధిక్యంలో ఉంది. గత ఎలక్షన్స్‌లో హస్తం పార్టీ 19 సీట్లు గెలవగా ఇప్పుడు మరింత దిగజారింది.

News November 14, 2025

జూబ్లీ బైపోల్: కాంగ్రెస్‌ LEADను టచ్ చేయని BJP!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BJPకి వచ్చిన ఓట్లు ఆ పార్టీ శ్రేణులను నిరాశలో పడేశాయి. పోస్టల్ బ్యాలెట్‌లో 20 ఓట్లు రాగా.. 10 రౌండ్లు ముగిసేసరికి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. మొత్తం పోలైన ఓట్లలో 8.76 శాతంతో 17,061 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ 50.83 శాతంతో 98,988 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి మీద 24,729 ఓట్ల తేడాతో గెలుపొందారు. కనీసం INC LEAD ఓట్లు కూడా BJPకి రాకపోవడం గమనార్హం.