News August 28, 2025
గద్వాల్: కాంగ్రెస్ నుంచి BRSలోకి బీఎస్ కేశవ్

గద్వాల మాజీ మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు భరోసా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో గుడ్ న్యూస్ ఏదీ లేదని విమర్శించారు. అనంతరం BRS చేరుతున్నట్లు తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News August 28, 2025
NZB: 7 పునరావాస కేంద్రాలు.. 164 కుటుంబాలు

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం చందూర్, ధర్పల్లి, డిచ్‌పల్లి, NZB రూరల్, జక్రాన్‌పల్లి మండలాల్లో 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డ తెలిపారు. అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. 164 కుటుంబాలకు చెందిన 358 మంది ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదన్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు.
News August 28, 2025
NZB: 12,413 ఎకరాల్లో పంట నష్టం: కలెక్టర్

జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, భీమ్‌గల్, ఇందల్వాయి మండలాల్లోని కొండాపూర్, తూంపల్లి, గడ్కోల్, ముషీర్ నగర్, హోన్నాజీపేట్, వాడి, నడిమితండా, బెజ్జోరా, సిర్నాపల్లి గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. పై ప్రాంతాల్లో మూడు చెరువులు తెగిపోగా, సుమారు 12,413 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు చెప్పారు. నీట మునగడం వల్ల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.
News August 28, 2025
మంచిర్యాల: ‘దేవుని పేరుతో సింగరేణి యాజమాన్యం దోపిడీ?’

దసరా వేడుకల కోసం దేవుడి పేరు చెప్పి సింగరేణి యాజమాన్యం, యూనియన్ల నాయకులు దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. SRP1 గని మూతపడుతుందని కార్మికుల నుంచి 2024- 25 సంవత్సరం రూ.వెయ్యి వసూలు చేసి, మళ్లీ ఇప్పుడు పండుగ పేరుతో రూ.800 వసూళ్లకు నిర్ణయించినట్లు సమాచారం. యాజమాన్యాన్ని ఎదురించలేక కార్మికులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. కార్మికులకు నోటీస్ పెట్టినట్లు తెలిసింది.