News November 19, 2025

గద్వాల్: కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ

image

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి సహచర మంత్రులతో కలిసి చీరల పంపిణీ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, మహిళా సంఘం సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈవీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గద్వాల కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాకు 86 వేల చీరలు అందినట్లు తెలిపారు.

Similar News

News March 6, 2026

ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు!

image

TG: రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో <<19171673>>ఫీజులు పెరిగాయి<<>>. ప్రస్తుత, వచ్చే విద్యా సంవత్సరాలకు సంబంధించి 160 కాలేజీల ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. TAFRC సిఫార్సుల మేరకు అత్యల్పంగా ₹45 వేలు, అత్యధికంగా ₹1.83 లక్షలుగా నిర్ణయించింది. CBIT(₹1.83 లక్షలు), వాసవి(₹1.75 లక్షలు), MGIT(1.67 లక్షలు), CVR(₹1.63 లక్షలు)లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయి. 35కు పైగా కాలేజీల్లో ₹లక్షకు పైనే ఉండటం గమనార్హం.

News March 6, 2026

రష్యా క్రూడాయిల్ వచ్చేస్తోంది!

image

అమెరికా <<19308509>>ఆంక్షల సడలింపు<<>>తో రష్యా నుంచి భారీగా ముడి చమురు ఇండియాకు రానుంది. 1.5 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్‌తో కూడిన 12కి పైగా ట్యాంకర్లు భారత తీరానికి దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అవి వారంలో మన పోర్టులకు చేరుకోవచ్చని బ్లూమ్‌బర్గ్ డేటా చెప్పింది. సింగపూర్ వద్ద ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలోనే వస్తాయని వివరించింది. US నుంచి సిగ్నల్ రాకముందే రష్యా ట్యాంకర్లు ఇండియా వైపు మళ్లాయని తెలుస్తోంది.

News March 6, 2026

తిరుపతి: రేపే మహిళా యూనివర్సిటీ కాన్వకేషన్

image

తిరుపతి శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శనివారం 22వ కాన్వకేషన్ నిర్వహిస్తున్నట్లు వీసీ ఉమ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మొత్తం 1,601 మందికి డిగ్రీ పట్టాలు అందజేస్తామని తెలిపారు.