News December 17, 2025
గద్వాల్: కోర్టు భవన స్థల ఎంపికకు కమిటీ ఏర్పాటు

గద్వాల జిల్లా కోర్టు భవన స్థలం ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు అడ్వకేట్ టి మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థలం ఎంపిక కోసం సీనియర్ న్యాయవాదులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ జిల్లా న్యాయమూర్తి ఎన్ ప్రేమలత సర్య్కులర్ జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. కమిటీ తమ నివేదికను 09-01-2026 లోపు లేదా అంతకు ముందు సమర్పించాలని జిల్లా న్యాయమూర్తి ఆదేశించారని చెప్పారు.
Similar News
News December 18, 2025
గండిపేట నీరు సురక్షితం.. వదంతులు నమ్మొద్దు: జలమండలి క్లారిటీ!

గండిపేటలో మురుగునీరు కలిసినట్లు వస్తున్న వార్తలను జలమండలి MD అశోక్ రెడ్డి ఖండించారు. వ్యర్థాలను పారబోసేందుకు యత్నించిన ప్రైవేట్ ట్యాంకర్‌ను ముందే గుర్తించి అడ్డుకున్నారని, రిజర్వాయర్ కలుషితం కాలేదని స్పష్టం చేశారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, IS ప్రమాణాలతో ‘మూడంచెల క్లోరినేషన్’ పద్ధతిలో నీటిని శుద్ధి చేస్తున్నట్లు వివరించారు.
News December 18, 2025
వనపర్తి: ‘ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి’

రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,80,294 రేషన్ కార్డుల్లోని 6,09,645 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటివరకు 4,23,466 మంది లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగతా 1,86,179 లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు అందుబాటులో ఉన్న రేషన్ షాపుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.
News December 18, 2025
కలెక్టర్ల సద్దస్సులో పాల్గొన్న విశాఖ కలెక్టర్, సీపీ

రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సమావేశంలో విశాఖపట్నం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీపీ శంకబ్రత బాగ్చి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులపై చర్చించారు.


