News February 12, 2025

గద్వాల్: ఘనంగా భూలక్ష్మి చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం 

image

గద్వాల్ జిల్లా కేంద్రంలోని భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి లింగం బావిలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు విగ్రహాలను లింగం బావిలో ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు గద్వాల్ పట్టణ ప్రజలు భారీగా హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

Similar News

News February 12, 2025

కొవ్వూరు: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఉమ్మడి తూ.గో జిల్లా వాడపల్లికి చెందిన చిట్రా సూర్య(20) మంగళవారం ఇంట్లో ఉరేసుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. రాజమండ్రిలో ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అతడికి ఓ బాలికతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన ఆమెను కలిసేందుకు వెళ్లాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అతడిని బెదిరించి దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 12, 2025

రాయచోటి: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

భార్యను క్రూరంగా హత్యచేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ రాయచోటి 5వ అదనపు జిల్లా జడ్జి తీర్పిచ్చారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి ధనంజయ(31) తన భార్య లక్ష్మీదేవిని 2017 ఫిబ్రవరిలో హత్య చేశాడు. అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు. కోర్టు పూర్వాపరాలను విచారించింది. నేరం రుజువు కావడంతో ధనంజయకు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం జడ్జి కృష్ణన్ కుట్టి తీర్పునిచ్చారు.

News February 12, 2025

సంగారెడ్డి: టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

image

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నచింతకుంట గ్రామానికి చెందిన విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!