News August 17, 2025

గద్వాల్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కర్ణాటక రాష్ట్రం సైదాపూర్ వద్ద నిన్న ఘోర రోడ్డు చోటుచేసుకుంది. గట్టు మండలం మాచర్లకు చెందిన పీజీ రాఘవేంద్ర(42), ఆయన బంధువు నాగేశ్(50) మృతి చెందారు. రాఘవేంద్ర గద్వాల్ చీరలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. వ్యాపారం అనంతరం పుణే నుంచి అక్కబావలతో కలిసి కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. సైదపూర్ వద్ద కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో మసుమన్న, ఈరమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News August 17, 2025

‘గీతాంజలి’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?

image

నాగార్జున కెరీర్‌లో ‘గీతాంజలి’ (1989) ఓ క్లాసిక్. మణిరత్నం తెరకెక్కించిన ఆ చిత్రంలో గిరిజ హీరోయిన్. తాజాగా జగపతి బాబు హోస్ట్ చేసిన ఓ షోలో ఆ సినిమా విశేషాలను ఆమె పంచుకున్నారు. ‘నాకు అది తొలి సినిమా. నాగార్జునకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సౌమ్యుడు. అతడు లెజెండ్‌కు తక్కువేం కాదు. నా ఫస్ట్ మూవీలో సహ నటుడిగా ఉన్నందుకు థాంక్యూ’ అని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఆమె స్క్రీన్‌పై కనిపించడంతో ఫొటో వైరలవుతోంది.

News August 17, 2025

నిర్మల్: రేపటి ప్రజావాణి రద్దు

image

జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి ఫిర్యాదులు చేసేవారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News August 17, 2025

మెదక్: గణేశ్ మండపాల వివరాలు ఆన్‌లైన్ తప్పనిసరి: ఎస్పీ

image

రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ మండప నిర్వాహకులు, సభ్యులు, కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ వారు రూపొందించిన వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.