News December 18, 2025

గద్వాల్ జిల్లాలో ఈ నెల 19న జాబ్ మేళా

image

గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు ఈనెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డాక్టర్ ప్రియాంక గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల కలిగి SSC, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. ఉదయం 11 :00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు.

Similar News

News December 20, 2025

అన్ని మతాలు మాకు సమానమే: సీఎం రేవంత్

image

TG: ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు ప్రభువు జన్మించారని CM రేవంత్ చెప్పారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని పేర్కొన్నారు.

News December 20, 2025

కశింకోట: విజయవంతంగా ముగిసిన సీఎం పర్యటన

image

సీఎం చంద్రబాబు పర్యటన అత్యంత కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య విజయవంతంగా ముగిసిందని డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. సమన్వయంతో పనిచేసిన సిబ్బందిని అభినందించారు. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు. సీఎం బందోబస్తుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 20, 2025

‘జగిత్యాలలో వెల్‌నెస్ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేయాలి’

image

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టు కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక వెల్‌నెస్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ PRTUTS జగిత్యాల జిల్లా శాఖ నాయకులు ఎమ్మెల్యే సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆనంద్ రావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.