News December 27, 2025

గద్వాల్ జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌లో 7,056 కేసులు

image

గద్వాల్ జిల్లాలో పోలీస్ శాఖ నేర వార్షిక నివేదిక విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 41 అత్యాచార కేసులు, 14 హత్యలు, 4 చోరీ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు తీవ్రతను చాటుతూ 204 ఘటనల్లో 135 మంది ప్రాణాలు కోల్పోగా, 189 మంది గాయపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 7,056 కేసులు నమోదు చేసి రూ. 33.96 లక్షల జరిమానా వసూలు చేశారు. గేమింగ్ యాక్ట్ కింద 64 కేసుల్లో 424 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News December 29, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 29, 2025

‘OP సిందూర్‌’లో మా ఎయిర్‌బేస్‌పై దాడి జరిగింది: పాక్ Dy PM

image

ఆపరేషన్ సిందూర్ సమయంలో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిందని పాక్ Dy PM ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. కానీ ఇండియా దాడిని సమర్థంగా అడ్డుకున్నట్లు గొప్పలకుపోయారు. ‘వాళ్లు(ఇండియా) మా పైకి 36 గంటల్లో 80 డ్రోన్లు పంపారు. మేం 79 ఇంటర్‌సెప్ట్ చేశాం. ఒకటి మాత్రం మా సైనిక స్థావరాన్ని డ్యామేజ్ చేసింది. మే 10న నూర్ ఖాన్ బేస్‌పై దాడితో ఇండియా తప్పు చేసింది. దీంతో పాక్ ప్రతీకార చర్యకు దిగింది’ అని చెప్పారు.

News December 29, 2025

వాళ్లు కన్నడ చిత్రాల్లో నటించట్లేదు: సుదీప్

image

మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదని హీరో కిచ్చా సుదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర పలు భాషల్లో అతిథి పాత్రలు చేశాం. నేను కొన్నిసార్లు డబ్బులే తీసుకోలేదు. కానీ ఆయా భాషల నటులు కన్నడ చిత్రాల్లో యాక్ట్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. నేను వ్యక్తిగతంగా కొందరు యాక్టర్స్‌ను అడిగినా నటించలేదు’ అని ‘మార్క్’ సినిమా ప్రమోషన్లలో ఆయన వాపోయారు.