News February 22, 2025

గద్వాల్ : తృటిలో తప్పిన పెను ప్రమాదం

image

జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రాయచూరు జిల్లాకు వెళ్లే మార్గంలో రోడ్డుకు పక్కన ఉన్న వెదురు బొంగుల గుడిసెలోకి శనివారం ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఆ సమయంలో వెదురు బొంగుల గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అక్కడ నిలిపి ఉన్న స్కూటర్‌ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News

News December 18, 2025

గజ్వేల్: ఒక్క మండల కేంద్రాన్ని దక్కించుకోని కాంగ్రెస్

image

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ డివిజన్‌లో అధికార కాంగ్రెస్ ఒక్క మండల కేంద్రాన్ని దక్కించుకోలేకపోయింది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపల్ కాగా, వర్గల్‌లో బీఆర్ఎస్, ములుగు- బీఆర్ఎస్, మర్కూక్- బీఆర్ఎస్, జగదేవపూర్- బీఆర్ఎస్, కుకునూరుపల్లి- బీఆర్ఎస్ దక్కించుకోగా, కొండపాక బీజేపీ ఖాతాలో పోయింది. దీంతో అన్ని మండల కేంద్రాల్లో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలే మిగిలాయి.

News December 18, 2025

ఆదిపూడిలో వివాహిత సూసైడ్

image

కారంచేడు మండలం ఆదిపూడి గ్రామంలో బుధవారం ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారంతో కారంచేడు ఎస్ఐ ఖాదర్ భాషా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు చీరాల ఆసుపత్రికి తరలించారు. బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదైంది.

News December 18, 2025

బాత్ సాల్ట్ గురించి తెలుసా?

image

బాత్ సాల్ట్ అనేది ఖనిజాలు కలిసిన ఉప్పు. దీన్ని కేవలం స్నానానికి మాత్రమే ఉపయోగిస్తారు. హిమాలయన్ బాత్ సాల్ట్, డెడ్ సీ బాత్ సాల్ట్… ఇలా చాలా రకాల స్నానపు ఉప్పులు ఉన్నాయి. ముఖంపై మొటిమలు, యాక్నే ఉంటే నీళ్లల్లో బాత్ సాల్ట్ వేసుకొని స్నానం చేస్తే జిడ్డు తగ్గుతుంది. దీంతో పాటు నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒత్తిడీ అదుపులో ఉంటుంది. స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్‌‌కూ బాత్ సాల్ట్ సాయపడుతుంది.