News January 28, 2026
గద్వాల్: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన తరుణంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గద్వాల పట్టణంలోని మున్సిపాలిటీ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ అక్కడ జరుగుతున్న నామినేషన్ ప్రక్రియ, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్‌తో భద్రతా ఏర్పాట్లపై డీఎస్పీ మొగిలయ్యతో చర్చించారు.
Similar News
News February 8, 2026
ప.గో: ఇరువర్గాల రాళ్ల దాడి

ఆకివీడు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో శనివారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంత నాగరాజు తెలిపారు. ముదురు బోయిన గోవిందస్వామి, ఆయన భార్య గంగాభవాని వర్గాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న వివాదం కాస్తా రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. ఈ గొడవలో గాయపడిన వారు ఆసుపత్రిలో చేరగా, వారి నుంచి సేకరించిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 8, 2026
భూపాలపల్లి: పుర పోరులో గండ్ర Vs గండ్ర!

భూపాలపల్లి గడ్డపై రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ పీఠమే లక్ష్యంగా ఇద్దరు ‘గండ్ర’ల యుద్ధం మొదలైంది. అధికార కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి హస్తం స్పీడ్ పెంచగా, కారు జోరును పెంచేందుకు BRS పోటీ పడుతోంది. అభివృద్ధి మంత్రం ఒకరు, జిల్లా ఉనికి అస్త్రం మరొకరు ఇలా విమర్శలతో పురపోరు రసవత్తరంగా మారింది. గెలుపు మాదంటే మాదని ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రేపటి సీఎం సభతో రాజకీయం మరింత వేడెక్కనుంది.
News February 8, 2026
ఓపెన్ డిగ్రీతో సాఫ్ట్‌వేర్ జాబ్!

TG: డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. TCSతో కలిసి ‘జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ అనే స్పెషల్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీంతో డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగ నియామకపత్రం అందేలా కోర్సును రూపొందించామని వీసీ ఘంట చక్రపాణి తెలిపారు. మార్చి 15లోగా అడ్మిషన్లకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు <


