News September 14, 2025

గద్వాల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నియామకంపై చర్చలు

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ గద్వాల ఇన్‌ఛార్జ్‌ని ప్రకటించకపోవడంతో క్యాడర్ కొంతమేర నిరాశకు గురైంది. నిన్న జరిగిన సభలో ఇన్‌ఛార్జ్‌ని ప్రకటిస్తారని శ్రేణులు భావించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం అన్నీ తానై పార్టీని చూసుకుంటున్న బాసు హనుమంతు నాయుడిని ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తారని భావించినా నిరాశ ఎదురయింది.

Similar News

News September 14, 2025

దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నూతన ఎస్పీ

image

ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం పుట్టపర్తి నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దుర్గా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పట్టణంలోని చర్చి, మసీదులకు వెళ్లి ఆయా మత సంప్రదాయాలను గౌరవిస్తూ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట పలువురు సిబ్బంది ఉన్నారు.

News September 14, 2025

PDPL: ‘రైతుల గోసకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’

image

రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న గోసకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని BKP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు 6.12లక్షల MTయూరియాను కేంద్ర ప్రభుత్వం పంపించిందన్నారు. ఇప్పటికే రాష్ట్రం వద్ద 1.76లక్షల యూరియా నిల్వలు ఉన్నాయని, యూరియా కొరత ఎందుకు ఏర్పడిందన్నారు.

News September 14, 2025

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

image

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.