News July 7, 2025
గద్వాల్: నిరుద్యోగ యువత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా నిరుద్యోగ యువత డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరణ చేశారు. అర్హులు 92814 23575, 23576,23577 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News July 7, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పలు ఉత్పత్తుల ధరలు కింది విధంగా ఉన్నాయి. ✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2459. కనిష్ఠం: 2129, ✓ మక్కలు: గరిష్ఠం: 2200. కనిష్ఠం: 2200, ✓ పత్తి: గరిష్ఠం:7421. కనిష్ఠం: 3899, ✓ పసుపు(కాడి): గరిష్ఠం: 10,852. కనిష్ఠం: 3809, ✓ పసుపు(గోల): గరిష్ఠం: 10,559. కనిష్ఠం: 5298.
News July 7, 2025
రాయదుర్గంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

రాయదుర్గంలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో నివాసముంటున్న చాంద్‌బాషా ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. బాషా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాల మీద కూర్చున్నాడు. ఈ క్రమంలో రైలు ఢీ కొట్టింది. గమనించిన లోకోపైలట్ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.
News July 7, 2025
మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఈనెల 10న నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు.