News December 9, 2025

గద్వాల్: నేటితో ముగియనున్న ప్రచారం

image

తొలి విడుత పంచాయతీ సమరం రెండు రోజుల్లో ముగియనుంది. జిల్లాలో ధరూర్, గద్వాల్, గట్టు, కేటిదొడ్డి మండలాల్లో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 106 గ్రామ పంచాయతీ, 974 వార్డు మెంబర్లకు గాను 14 సర్పంచ్, 120 వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోరు జరగనుంది. నేటితో ప్రచారానికి END కార్డు పడనుంది.

Similar News

News December 13, 2025

యోగ, ఆయుష్ సేవల విస్తరణపై ప్రశ్నించిన ఎంపీ కావ్య

image

దేశంలో యోగా ప్రచారం, హర్బల్‌ ఔషధాల నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ వంటి కీలక అంశాలపై లోక్ సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ యోగా క్యాంపైన్ల వివరాలు, వాటిలో పాల్గొన్న వారి సంఖ్య, కేటాయించిన బడ్జెట్‌ను వివరించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.

News December 13, 2025

సిద్దిపేట: ఎన్నికల విధులకు హాజరుకాని 182 మంది సస్పెండ్

image

ఈనెల 11న సిద్దిపేట జిల్లాలో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల విధులకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. హైమావతి తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ముందస్తుగానే కలెక్టర్ హెచ్చరించినప్పటికీ విధులకు గైర్హాజరు కావడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

News December 12, 2025

మినిస్టర్-ఇన్-వైటింగ్‌గా మంత్రి సీతక్క

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 17 నుంచి 22 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రి సీతక్కను రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి మినిస్టర్-ఇన్-వైటింగ్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించినట్లు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.