News January 16, 2026

గద్వాల్: పెళ్లి ఆగిపోవడంతో యువకుడి సూసైడ్

image

వివాహం ఆగిపోయిందని మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గద్వాల్ జిల్లాలోని మానవపాడులో చోటుచేసుకుంది. గురువారం స్థానిక యువతితో పెళ్లి జరగాల్సి ఉండగా నిలిచిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంతకళ్యాణ్ రెడ్డి (33) నిన్న ఉదయం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై స్వాతి తెలిపారు.

Similar News

News February 10, 2026

UPSC 2026: మళ్లీ మళ్లీ రాయడంపై పరిమితులు

image

UPSC 2026 నోటిఫికేషన్‌లో ఈసారి కీలక మార్పులు ఉన్నాయి. IAS, IFS ఆఫీసర్లు మళ్లీ ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. IPSలు ఎగ్జామ్ రాయొచ్చు. కానీ మళ్లీ IPS ఆప్షన్ ఎంచుకోలేరు. గ్రూప్-A సర్వీస్ వాళ్లకు ఇంప్రూవ్‌మెంట్ కోసం ఒకే ఒక్క ఛాన్స్ (2027లో) ఉంటుంది. వీళ్లు ఫౌండేషనల్ కోర్సు నుంచి ఏడాది మినహాయింపు కోరుతూ పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే సర్వీస్ క్యాన్సిలవుతుంది. 2027లోనూ ఎంపికైతే నచ్చిన సర్వీస్‌లో కొనసాగొచ్చు.

News February 10, 2026

ప.గో: రాష్ట్రానికి కేంద్ర బిందువుగా కొబ్బరి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ

image

సంప్రదాయంగా వరి, తోటపంటలకు ప్రసిద్ధి గడించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఇప్పుడు కొబ్బరి సాగులో రాష్ట్రానికి కేంద్రబిందువుగా మారింది. జిల్లాలో సుమారు 96 వేల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోంది. ఏటా 140 నుంచి160 కోట్ల కొబ్బరికాయల ఉత్పత్తి నమోదవుతోంది. రాష్ట్ర మొత్తం కొబ్బరి ఉత్పత్తిలో ఈ జిల్లా వాటా సుమారు 20 శాతంగా ఉంది. దీంతో కొబ్బరి ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి.

News February 10, 2026

WGL: ఛైర్మన్ వార్డులో ఓటుకు రూ.5 వేలు!

image

మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నగదు చేతులు మారింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఓటుకు నోటును సోమవారం రాత్రి పంచేశారు. ఉమ్మడి జిల్లాలో 12 మునిసిపాలిటీల్లోని 260 వార్డుల్లో పంపకాలు పూర్తి చేశారు. ఒక్కో వార్డులో ఒక్కో రీతినా పంచారు. ఛైర్మన్ వార్డులో ఓటుకు రూ.5 వేలు పంపకాలు చేయగా, రిజర్వు స్థానాల్లో సైతం రూ.వెయ్యి పంపిణీ చేశారు. ఒక్కో పార్టీ రూ.35 కోట్ల మేర నగదు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.