News November 6, 2025
గద్వాల్: మధ్యాహ్న భోజన ఛార్జీల పెంపు.. ఏజెన్సీలకు ఊరట

ప్రభుత్వం విద్యార్థుల కోసం అందించే మధ్యాహ్న భోజన పథకానికి ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ అధికారులు వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,227పాఠశాలల్లో 3,58,400 విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి అందిస్తున్న భోజనం కోసం పెరిగిన ధరల ప్రకారం నెలకు రూ.86 లక్షల అదనపు భారం పడనుంది. ధరలు పెరిగిన క్రమంలో ప్రభుత్వ ప్రకటనతో ఏజెన్సీలకు ఊరటనిసస్తోంది.
Similar News
News November 6, 2025
ఎల్లారెడ్డి: సలహాదారుడిని కలిసిన ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం పలు సమస్యలపై ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.
News November 6, 2025
మంచిర్యాల: కళ్లు దానం చేసిన ఎల్ఐసీ ఏజెంట్

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ఎల్ఐసీ ఏజెంట్ తన కళ్లను దానం చేశాడు. మంచిర్యాలకు చెందిన రాజన్న(56) నవంబర్ 1న ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. ఆయన చికిత్స పొందుతూ గురువారం మరణించగా కుటుంబ సభ్యులు ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకుకు దానం చేశారు.
News November 6, 2025
సంగారెడ్డి: చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య

చీమలకు భయపడి వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) మైర్మేకోఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


