News November 19, 2025
గద్వాల్: మరో సీసీఐ కొనుగోలు సెంటర్ ప్రారంభం

జిల్లాలో మరో సీసీఐ కొనుగోలు సెంటర్ ప్రారంభం కానునట్లు అలంపూర్ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ ఎల్లస్వామి తెలిపారు. ప్రస్తుతం బాలాజీ, వినాయక కాటన్ మిల్లులలో సీసీఐ కొనుగోలు జరుగుతుండగా తాజాగా గద్వాల్ మండలం హరిత కాటన్ మిల్లులో ఈనెల 21నుంచి కొనుగోలు జరుగుతాయన్నారు. విక్రయించాలనుకునే రైతులు రేపు గురువారం ఉదయం 8:30కి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. శని ఆదివారాలు మినహా 27వరకు స్లాట్స్ ఓపెన్ అవుతాయన్నారు.
Similar News
News November 23, 2025
నోబెల్ వచ్చినా దేశం దాటలేని పరిస్థితి

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విన్నర్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ 10న నార్వేలో జరిగే నోబెల్ పురస్కారాల వేడుకకు హాజరైతే, ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించినప్పటికీ, దేశం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
News November 23, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-NGRI 3 ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, MSc, M.Tech (జియో ఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, మెరైన్ జియోఫిజిక్స్), MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. NOV 28, DEC 3 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.ngri.res.in/
News November 23, 2025
బెల్జియం అమ్మాయి.. సిక్కోలు అబ్బాయి.. కట్ చేస్తే!

బెల్జియం దేశానికి చెందిన యువతి శ్రీకాకుళానికి చెందిన యువకునికి ఘనంగా వివాహం జరిగింది. శ్రీకాకుళం హయాతి నగర్‌కు చెందిన యువకుడు శ్రీ రంగనాథ సాహిత్ బెల్జియంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తనతోపాటు పనిచేస్తున్న కెమిలీ మస్కర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో శ్రీకాకుళంలో శనివారం రాత్రి జరిగిన వివాహంతో వారిద్దరు ఒకటయ్యారు.


