News December 17, 2025
గద్వాల్: ముగిసిన పోలింగ్.. ఫలితాలపై ఉత్కంఠ

జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ బుధవారం మానవపాడు మండలం జల్లాపురం, బోరవెల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానున్నది. ఫలితాలపై సర్పంచ్ అభ్యర్థులో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News December 20, 2025
NZB: ముదురుతున్న పోచారం-ఏనుగు వ్యవహారం

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మధ్య వ్యవహారం ముదురుతోంది. GP ఎన్నికల్లో పోచారం, ఏనుగు వర్గీయులు వేర్వేరుగా పోటీ చేశారు. MPTC, ZPTC ఎన్నికల్లోనూ రెండు వర్గాలు వేర్వేరుగా తలపడే అవకాశం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. <<18616051>>ఏనుగు రవిందర్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో<<>> చెప్పాలని నిన్న పోచారంభాస్కర్‌రెడ్డి అనడం చర్చనీయాంశంగా మారింది.
News December 20, 2025
IRCTC వాలెట్‌తో బోలెడు ప్రయోజనాలు

IRCTC E-వాలెట్‌లో జమ చేసిన డబ్బులను నేరుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనివలన ప్రయాణికులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. తత్కాల్ టికెట్లు కేవలం సెకన్లలోనే బుక్ అవుతాయి. పేమెంట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసినా, బుకింగ్ కాకపోయినా రిఫండ్ డబ్బులు వెంటనే వచ్చేస్తాయి. అదే సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే రోజుల తరబడి వేచి చూడాలి.
News December 20, 2025
కాంగ్రెస్ తీరుపై ఎమ్మెల్యే కూనంనేని అసంతృప్తి..!

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వైఖరిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పొత్తు ఉంటుందని భావిస్తే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. తాము కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నచోట పోటీకి దూరంగా ఉన్నామని, కానీ సీపీఐ బరిలో ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ తన మద్దతుదారులను నిలబెట్టడం శోచనీయమన్నారు.


