News December 31, 2025
గద్వాల్: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయండి- కలెక్టర్

పురపాలికల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం గద్వాల కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికలు,పురపాలికల్లో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Similar News
News December 31, 2025
కృష్ణా: క్షేమంగా ఉంటేనే.. మీ ఇంట్లో ఆనందం.!

న్యూ ఇయర్ వేళ యువత అత్యుత్సాహానికి పోకుండా రూల్స్ పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ డ్రైవింగ్, సైలెన్సర్ లేని బైకులు, మద్యం సేవించి వాహనాలు నడపడం మీ ప్రాణాలకే కాదు, మీ కుటుంబానికీ తీరని లోటును మిగిల్చుతాయి. ఒక ఏడాది పోతే మరో ఏడాది వస్తుంది, కానీ ప్రాణం పోతే తిరిగి రాదని గుర్తుంచుకోవాలి. మీరు క్షేమంగా ఉంటేనే మీ ఇంట్లో ఆనందం ఉంటుంది. ఏ ప్రమాదం జరిగిన నష్టం వెనక్కిరాదని గుర్తుంచుకోవాలి.
News December 31, 2025
సంగారెడ్డి: న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

జిల్లా ప్రజలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నూతన సంవత్సర (2026) శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
News December 31, 2025
సంగారెడ్డి: భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

జిల్లాలో భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులను వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలు కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు.


