News December 25, 2025

గద్వాల్: రైతు మృతి వదంతులు వ్యాపింప చేయవద్దు- కలెక్టర్

image

మానవపాడు మండలం కలుకుంట్ల రైతు వేదిక వద్ద బుధవారం ఉండవెల్లి మండలం బొంకూరు రైతు జమ్మన్న వృద్ధాప్యం, రక్తపోటు వల్ల గుండెపోటుతో మృతి చెందాడని గద్వాల కలెక్టర్ సంతోష్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలను కలెక్టర్ ఖండించారు. జమ్మన్న మొక్కజొన్న ఈనెల 23న కొనుగోలు చేయగా 24న బయోమెట్రిక్స్ కోసం వచ్చి గంటసేపు ఉన్నాడని తెలిపారు. ఆయన మృతిని అధికారులపై నెట్టివేయడం సరైంది కాదన్నారు.

Similar News

News December 30, 2025

రాష్ట్రంలో 198 పోస్టులు.. ప్రారంభమైన అప్లికేషన్లు

image

TG: ఆర్టీసీలో 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. జనవరి 20 వరకు <>https://www.tgprb.in/<<>> సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.27వేల నుంచి రూ.81వేల వరకు ఉంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, మిగతా వారికి రూ.800గా నిర్ణయించారు. వయసు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు. విద్యార్హత పోస్టులను బట్టి టెన్త్, డిగ్రీ.

News December 30, 2025

కొండగట్టులో కలెక్టర్ దంపతుల ప్రత్యేక పూజలు

image

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ దంపతులు మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజల శ్రేయస్సు, సుఖసంతోషాలు, శాంతి భద్రతలు, సమగ్ర అభివృద్ధి కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు కలెక్టర్ తెలిపారు.

News December 30, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>), నవీ ముంబైలో 4 డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.472. పే స్కేల్ రూ.40,000 నుంచి రూ.1,40,000వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.