News October 10, 2025
గద్వాల్: సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి

సమాచార హక్కు చట్టం ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఈనెల 5 నుంచి 12 వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గద్వాల ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా అధికారులకు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు.
Similar News
News October 10, 2025
రేపు దేవళంపేటలో పర్యటించనున్న మంత్రి

వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోం మంత్రి అనిత శనివారం పరిశీలించనున్నట్లు జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులుతెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమెతోపాటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.
News October 10, 2025
వరి సంబంధిత రకాల మద్దతు ధరలు ఇలా: కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 3.15 లక్షల ఎకరాల్లో సాగయిన వరి నుంచి 7.5-8 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనావేశామని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వరి మద్దతు ధర గ్రేడ్ ఏ రూ.2,389 కాగా, బోనస్‌గా క్వింటాకు రూ.500 చెల్లించడం జరుగుతుందని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు. సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర ఉందన్నారు. 421 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News October 10, 2025
యాదాద్రి: ఫోన్‌లో మాట్లాడి.. ఉరేసుకున్న యువకుడు.!

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ నల్ల శంకర్ (22) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 9 రాత్రి తల్లిదండ్రులు వేరే ఇంటికి వెళ్లగా, శంకర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఈరోజు ఉదయం 6 గంటలకు వంటగది పైకప్పుకు చీరతో ఉరేసుకుని కనిపించాడు. ఓ అమ్మాయితో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని ఫిర్యాదు అందినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.