News January 15, 2026
గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, MBNR ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం కలిశారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యల గురించి చర్చించినట్లు సమాచారం.
Similar News
News February 12, 2026
హగ్ డే స్పెషల్.. CSK నుంచి స్పెషల్ పోస్ట్

నేడు ‘హగ్ డే’ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ మైదానంలోని మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ, స్మృతి- హర్మన్, ధోనీ- జడేజా, టెండూల్కర్-ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లు కౌగిలించుకున్న అరుదైన చిత్రాలను CSK తన X ఖాతాలో పంచుకుంది. గెలుపు సమయంలో పొంగివచ్చే సంతోషాన్ని ఈ ఫొటోలు ప్రతిబింబిస్తున్నాయి.
News February 12, 2026
సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్.. తేడాలేంటో తెలుసా?

సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఇద్దరూ మానసిక ఆరోగ్యనిపుణులే అయినప్పటికీ చదువు, చికిత్స పద్ధతుల్లో తేడాలు ఉంటాయి. సైకియాట్రిస్టులు డాక్టర్లు (MBBS/MD). వీరు మందుల ద్వారా చికిత్స చేస్తారు. మరోవైపు సైకాలజిస్టులు ప్రొఫెషనల్ వైద్యులు కాదు. డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యలను టాక్ థెరపీ/కౌన్సెలింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. వీరికి మందులు రాసే అధికారం ఉండదు.
News February 12, 2026
MBNR: PMను కలిసే అవకాశం.. రిజిస్ట్రేషన్ చేసుకోండి

నూతన బడ్జెట్‌పై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యువజన అధికారి వి.కోటా నాయక్ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ప్రతిభకనబరిచిన యువతి, యువకులు జాతీయస్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించి, నేరుగా ప్రధానిని కలిసి మాట్లాడే అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తుందని, 15-29 వయస్సు గలవారు అర్హులని, ఆసక్తి గల యువత ఈనెల 17లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. Site:https://mybharat.gov.in


