News November 16, 2025
గద్వాల్ స్టేషన్‌లో ఆగే రైళ్లు ఇవే..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. గద్వాల రైల్వే స్టేషన్‌లో 17022 వాస్కో- హైదరాబాద్ 12976 మైసూర్- జైపూర్ రైళ్లను నిలిపే ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో గద్వాల్ నియోజకవర్గ ప్రజలు ఎంపీ అరుణమ్మకు ధన్యవాదాలు తెలిపారు. # SHARE IT
Similar News
News November 16, 2025
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎంపీ అరుణకు విశేష స్వాగతం

సౌతాఫ్రికా అధికారిక పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పాలమూరు ఎంపీ డీకే.అరుణను ఉమ్మడి మహబూబ్‌నగర్ నాయకులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అందరి ఆదరణకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు–2025 JPC సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
News November 16, 2025
టెస్టుకు దూరమైన గిల్

టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన పాల్గొనరని BCCI వెల్లడించింది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ గిల్ మెడనొప్పితో మైదానాన్ని వీడారు. అటు ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా స్కోర్ 93/7గా ఉంది.
News November 16, 2025
ఫోన్ కోసం అలిగి.. బాలుడు అదృశ్యం: ఎస్ఐ

సెల్ ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ బాలుడు (11) అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న బాలుడు ఫోన్ పగులగొట్టి వెళ్లిపోయాడని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జయలక్ష్మి తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.


