News November 18, 2025

గద్వాల్: హంద్రీ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే హంద్రీ EXPRESS నుంచి గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు మహబూబ్‌నగర్ రైల్వే ఎస్సై కే.రాజు తెలిపారు. దివిటిపల్లి బ్రిడ్జి రైల్వే లైన్ సమీపంలో డెడ్‌బాడీ లభించింది. మృతుడికి (25) ఉండవచ్చునని, రన్నింగ్ ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయినట్లు గుర్తించారు. ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే సెల్ నంబర్ 8712658597 సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News November 19, 2025

టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

image

సున్నితమైన, రెచ్చగొట్టే కంటెంట్ ప్రసారంపై TV ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఎర్రకోట పేలుడు సహా ఇటీవలి ఘటనలకు సంబంధించిన సమాచార ప్రసారానికి దూరంగా ఉండాలని కోరింది. కొన్ని ఛానెళ్లు హింసను ప్రేరేపించేలా, శాంతికి భంగం కలిగించేలా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వీడియోలు టెలికాస్ట్ చేశాయని పేర్కొంది. ఇది చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించే దృశ్యాలను ప్రసారం చేయొద్దని సూచించింది.

News November 19, 2025

భీమవరం: వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రిక ఆవిష్కరణ

image

ఈనెల 19న వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకొని మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకపోవడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా ప్రజలు, జంతువులు ఎన్నో వ్యాధులకు గురి అవుతున్నాయని తెలిపారు.

News November 19, 2025

గోదావరిఖని: మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు: సీపీ

image

నషా ముక్త్ భారత్‌లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ పిలుపునిచ్చారు. మంగళవారం రామగుండం కమీషనరేట్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ నిర్మూలన విషయంలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.