News December 7, 2025
గద్వాల్: 16 హామీలతో మ్యానిఫెస్టో

ధరూర్ మండలం రేవులపల్లి సర్పంచ్ అభ్యర్థి శృతి 16 హామీలతో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. నిలిచిన బృందావన గార్డెన్, స్కూల్ భవనం పూర్తి, కొత్త R&R సెంటర్‌లో మౌలిక వసతుల కల్పన లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, జెనో కో ఫ్రీ కరెంట్ ZPHSలో ఇంగ్లిష్ మీడియం టీచర్లను ఏర్పాటు చేస్తానన్నారు. అకాలంగా మరణించిన వారికి పంచాయతీ తరఫున రూ.5000 ఆర్థిక సాయం అందిస్తానన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేయాలన్నారు.
Similar News
News April 5, 2026
NZB: నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలి: కవిత

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కవిత ఆదివారం X వేదికగా డిమాండ్ చేశారు. వడగళ్ల వాన బోధన్ నియోజకవర్గ రైతులకు కన్నీటిని మిగిల్చిందని సాలూర, ఖాజాపూర్, హున్సా, మందర్నా గ్రామాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు.
News April 5, 2026
రాజంపేట: జాతర ఎప్పుడో తెలియదు.. జెయింట్ వీల్ వచ్చేసింది

రాజంపేటలో ప్రసిద్ధి చెందిన బలిజపల్లి గంగమ్మ జాతర ఎప్పుడు అనేది ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. ఈరోజు, ఆరోజు అంటూ పుకార్లు షికార్లు చేస్తుండడంతో భక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సంప్రదాయం ప్రకారం ఆ ప్రాంతంలోని కొన్ని కుటుంబాలకు మాత్రమే జాతర నిర్వహణ బాధ్యతఉంది. అందువల్ల ప్రతి ఏడాది ఇదే తంతు నడుస్తోంది. జాతర ఉంటుందని నమ్మి ఈ ఆదివారం వ్యాపారులు జెయింట్ వీల్ తీసుకొచ్చారు.
News April 5, 2026
శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డీఎస్పీ వివేకానంద పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత దేశ ఉప ప్రధాని అని అన్నారు. దళిత వర్గాల ఆశాజ్యోతి అని, వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.


