News December 15, 2025
గద్వాల్: 5 గంటల నుంచి మద్యం దుకాణాలు మూసివేత

ఈనెల 17న జరగనున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, ఎర్రవల్లి, ఇటిక్యాల, మనోపాడ్, ఉండవెల్లి, అలంపూర్ మండలాల పరిధిలో నేటి సాయంత్రం 5 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలను పూర్తిగా మూసి ఉంచాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 17, 2025
ధనుర్మాసం: రెండవరోజు కీర్తన

‘భాగ్యవంతులైన గోకుల గోపికలారా! ఈ ధనుర్మాస వ్రతంలో మన కర్తవ్యం నారాయణుని పాదాలను కీర్తించడం. వ్రత కాలంలో ఇతర విషయాలు తలవకుండా, పాలు, నేతిని తాగడం, కంటికి కాటుక, సిగలో పూలు ధరించడం వంటివి మానేయాలి. శాస్త్ర విరుద్ధ పనులు చేయరాదు. చాడీలు చెప్పవద్దు. సన్యాసులు, బ్రహ్మచారులకు దానాలు చేయాలి. మనకు మోక్షాన్ని ఇచ్చే ఇతర మార్గాలన్నీ సంతోషంగా ఆచరించాలి. ధనుర్మాసమంతా ఈ నియమాలనే పాటించాలి’. <<-se>>#DHANURMASAM<<>>
News December 17, 2025
మెదక్: నాడు భర్త ఉప సర్పంచ్.. నేడు భార్య సర్పంచ్

గత ఎన్నికలలో గెలిచి భర్త పాలకవర్గంలో ఉప సర్పంచ్‌గా సేవలు అందించగా నేడు భార్య సర్పంచ్‌గా గెలిచి సేవలు అందించనున్నారు. మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారంలో సర్పంచ్‌గా చింతకింది దివ్య గెలుపొందారు. ఒకే కుటుంబంలో భర్త, భార్య గెలిచి నిలిచారు.
News December 17, 2025
IPL మినీ వేలం.. అన్‌సోల్డ్ ప్లేయర్లు!

మెక్ గుర్క్, కాన్వే, అన్మోల్ ప్రీత్, అభినవ్ మనోహర్, యష్ ధుల్, కోయెట్జి, స్పెన్సర్ జాన్సన్, తీక్షణ, సిమర్జిత్ సింగ్, కర్ణ్ శర్మ, సకారియా, మురుగన్ అశ్విన్, KC కరియప్ప, తస్కిన్ అహ్మద్, అల్జారీ జోసెఫ్, రిచర్డ్‌సన్, అట్కిన్సన్, ముల్డర్, దీపక్ హుడా, విజయ్ శంకర్, లోమ్రోర్, తనుష్ కోటియన్, కమలేశ్ నాగర్‌కోటి, అబాట్, బ్రేస్ వెల్, శనక, డారిల్ మిచెల్, KS భరత్, గుర్బాజ్, బెయిర్ స్టో, జామీ స్మిత్ తదితరులు.


