News April 1, 2025

గద్వాల: ‘అంబేడ్కర్ ఆలోచన పండగను విజయవంతం చేయాలి’

image

అంబేడ్కర్ ఆలోచన పండుగను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బుడకల ప్రకాశ్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ చౌరస్తాలో కరపత్రాలను విడుదల చేశారు. ఏప్రిల్ 12వ తేదీన అంబేడ్కర్ ఆలోచన పండుగను నిర్వహిస్తున్నామన్నారు. ఆ రోజు జిల్లా కేంద్రంలో 10 గంటలకు జరిగే పండగకు జిల్లా వ్యాప్తంగా అంబేడ్కరిస్ట్‌లు తరలిరావాలని కోరారు.

Similar News

News April 2, 2025

ములుగు: చర్చలకు మేము సిద్ధం.. ‘మావో’ లేఖ

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు మేము సిద్ధమేనని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ములుగు జిల్లాలో ఓ లేఖ చెక్కర్లు కొడుతుంది. ఛతీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో చేపట్టిన ‘కగార్’ వెంటనే విరమించాలని, బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ప్రతిపాదనలకు స్పందిస్తే తక్షణమే కాల్పులు విరమిస్తామన్నారు.

News April 2, 2025

2019లోనూ నలుగురు MLAలను గెలిపించారు: లోకేశ్

image

AP: ప్రకాశం జిల్లా అంటే ప్రేమ, పౌరుషం గుర్తొస్తాయని మంత్రి లోకేశ్ అన్నారు. 2019లో TDPకి రాష్ట్రంలో ఎదురుగాలి వీచినా, జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. TDP, చంద్రబాబు అంటే ఈ జిల్లా ప్రజలకు చాలా గౌరవం ఉందన్నారు. యువగళం పాదయాత్ర ప్రకాశంలో ఓ ప్రభంజనంలా నడిచిందని, అప్పుడు జిల్లా ప్రజల కష్టాలు చూసినట్లు చెప్పారు. ఆ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించారు.

News April 2, 2025

రాజీవ్ యువ వికాస పథకంపై విస్తృత అవగాహన కల్పించండి: కలెక్టర్

image

రాజీవ్ యువ వికాస పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. అర్హులైన యువత ఆన్‌లైన్లో దరఖాస్తు చేసి, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పిస్తే, వాటిని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన హెల్ప్ డెస్క్ ద్వారా ఆన్‌లైన్ చేస్తామని తెలియజేశారు. అధికారులు ప్రజలకు అవగహన కల్పించాలన్నారు.

error: Content is protected !!