News October 27, 2025
గద్వాల: ఆన్‌లైన్ చెల్లింపులతో లబ్ధిదారులకు ఆనందం

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అమలవుతోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. బిల్లుల ఆమోదం నుంచి చెల్లింపుల వరకు లబ్ధిదారులు ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వం ఆన్‌లైన్ విధానంలో నేరుగా చెల్లింపులు చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 27, 2025
భారీ వర్షాలు.. చామంతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అధిక వర్షాల వల్ల చామంతిలో వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. పంటలో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపాలి. వేరుకుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా విడోమిల్ ఎంజడ్ 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజమ్ ఒక గ్రాము మరియు మ్యాంకోజబ్ 2.5 గ్రా. లేదా లీటరు నీటికి హెక్సాకోనోజోల్ 2ml కలిపి పిచికారీ చేయాలి.
News October 27, 2025
కృష్ణా జిల్లాలో 188 రిలీఫ్ క్యాంప్‌లు

మొంథా తుపాన్ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో 188 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 670 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మచిలీపట్నం డివిజన్ లో 93 కేంద్రాలు ఏర్పాటు చేయగా 534 మందిని, ఉయ్యూరు డివిజన్‌లో 61 కేంద్రాలకు గాను 141 మందిని తరలించారు. గుడివాడ డివిజన్‌లో 34 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒక్కరిని కూడా తరలించలేదు.
News October 27, 2025
డౌన్ సిండ్రోమ్ లక్షణాలివే..

డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. మెడ వెనక భాగంలో దళసరిగా ఉండటం, చెవి డొప్పలు చిన్నగా ఉండటం, చప్పిడి ముక్కు, ఎత్తు పెరగకపోవడం, తల చిన్నగా ఉండటం, మానసిక వికాసం ఆలస్యంగా ఉండటంతో పాటు గుండె, కంటి సమస్యలు, హైపోథైరాయిడిజం వంటివీ ఉంటాయి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. కానీ నిపుణుల పర్యవేక్షణలో థెరపీలు తీసుకుంటుంటే కాస్త ఫలితం కనిపిస్తుంది.


