News March 7, 2025
గద్వాల: ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

సాంప్రదాయ చేతివృత్తుల వారు ఆర్థికంగా మరింత స్థిరపడేందుకు రూపొందించిన పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న చేతి, కుల వృత్తుల వారికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన పథకం అమలు చేశారన్నారు.
Similar News
News September 18, 2025
VKB: ‘బియ్యాన్ని సమయానికి అందించాలి’

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించే బియ్యాన్ని సమయానికి అందించాలని రైస్ మిల్లర్లకు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు నిర్దేశించిన రైస్‌ను సకాలంలో అందిస్తే జిల్లాలోని రేషన్ షాపులకు త్వరగా పంపిణీ చేస్తామన్నారు.
News September 18, 2025
పార్వతీపురం: ‘స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత’

స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత ఉంటుందని, మార్గదర్శి నిర్ణయమే ముఖ్యమని జాయింట్ కలెక్టర్ సి. యస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ పి-4 బంగారు కుటుంబాల శిక్షణా తరగతులపై సమావేశం ఏర్పాటు చేశారు. బంగారు కుటుంబాల దత్తతకు మార్గదర్శకులు ముందుకు రావాలని కోరారు. ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదని వారు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే రావచ్చని పేర్కొన్నారు.
News September 18, 2025
APకి 13వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు

AP: రాష్ట్రానికి 13,050 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీకి గంగవరం పోర్టు ద్వారా యూరియా రాష్ట్రానికి చేరనుంది. కాగా ఈ కేటాయింపుతో రైతులకు మరింత వెసులుబాటు కలుగుతుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని, రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.