News March 4, 2025

గద్వాల: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: హృదయరాజ్ 

image

గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో మొత్తం 8,341 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించరని పేర్కొన్నారు.

Similar News

News November 14, 2025

జగిత్యాల: మెగా జాబ్ మేళా.. 350 మందికి ఉద్యోగాలు

image

జగిత్యాలలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 1,000 మంది మహిళా నిరుద్యోగులు పాల్గొన్నారు. అందులో 350 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం విధుల్లో చేరేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News November 14, 2025

60 పోస్టులకు TSLPRB నోటిఫికేషన్

image

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 27 ఉ.8 గంటల నుంచి డిసెంబర్ 15 సా. 5 గంటల వరకు <>వెబ్‌సైట్‌లో<<>> దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హతలతో పాటు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.

News November 14, 2025

చేసిన మంచిని చెప్పుకోలేక ఇబ్బంది పడ్డా: CBN

image

AP: సంస్కరణలతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని CM CBN తెలిపారు. ఇందుకు HYD అభివృద్ధే ఉదాహరణ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు రూపొందించాలని సూచించారు. తాను చేసిన మంచిని చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడడంతో గతంలో ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థతో పాటు AP ఇమేజ్ అంతర్జాతీయంగా దెబ్బతిందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా తెరుస్తున్నామని తెలిపారు.