News March 12, 2025
గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేందుకు మేస్త్రీలు శిక్షణను సమర్థవంతంగా ఉపయోగించుకుని తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం పాత కలెక్టర్ కార్యాలయం వెనక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌తో కలిసి నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
నిజాం పాలనకు చరిత్ర గుర్తు జగిత్యాల ఖిల్లా

నిజాం పాలన చరిత్ర గుర్తులుగా జగిత్యాలలోని ఖిలా సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. క్రీ.శ.1747లో జగిత్యాలలో నక్షత్రాల్లా ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్ల సాంకేతిక సహకారంతో నిర్మించారు. జగిత్యాల కోట రాయి, సున్నంతో నక్షత్రాకారంలో నిర్మించగా, ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది నిర్మించి దాదాపు 250 సం.లు కావొస్తుంది. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి.
News September 17, 2025
ఉద్యమాల పురిటి గడ్డ.. జగిత్యాల జిల్లా

నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించి HYD సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు జరిగిన ఉద్యమాల్లో జగిత్యాల నుంచి ఎందరో యోధులు పాల్గొన్నారు. వారి త్యాగాల ఫలితంగా 1948 SEC 17న HYD సంస్థానం దేశంలో విలీనమైంది. 1947 AUG 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా HYD సంస్థానం దేశంలో అంతర్భాగం కానీ పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, జగిత్యాల జైత్రయాత్రకు ఇక్కడి నుంచే పునాది.
News September 17, 2025
వేగంలో రారాజు.. మెట్లు ఎక్కడానికి ఆయాస పడుతున్నారు!

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా పేరొందిన ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు ఫిట్‌నెస్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మెట్లు ఎక్కడానికి కూడా ఆయాస పడుతున్నట్లు ఆయన తెలిపారు. అందుకే తన శ్వాసను మెరుగుపరచుకోవడానికి మళ్లీ పరిగెత్తడం ప్రారంభిస్తానని ఆయన పేర్కొన్నారు. 2017లో రిటైర్ అయినప్పటి నుంచీ వ్యాయామం చేయకుండా సినిమాలు చూస్తూ పిల్లలతో గడుపుతున్నానని చెప్పారు.