News December 5, 2025
గద్వాల: ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలి: రాణీ కుముదిని

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, పరిశీలకులు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీల పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు.
Similar News
News December 5, 2025
MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నామినేషన్ల జోరు

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండో రోజున వార్డు సభ్యులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజున కేవలం 175 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజున భారీగా 864 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 236 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు అయ్యాయి. బాలానగర్ నుంచి 231, భూత్పూర్ 155, మూసాపేట 126, అడ్డాకుల 116 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.
News December 5, 2025
గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ‘సండే ఈవినింగ్ టాక్’

బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ క్యాంపస్‌లో ఆదివారం ‘సండే ఈవినింగ్ టాక్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సా.6:30 నుంచి రాత్రి 8 గం. వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్‌మెంట్) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన, ధ్యాన అనుభవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
News December 5, 2025
పుతిన్ పర్యటన.. నేడు కీలకం!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్‌లో పాల్గొననున్నారు. 11.50గం.కు <<18467026>>హైదరాబాద్ హౌస్<<>>లో ఈ మీటింగ్ జరగనుంది. రక్షణ బంధాల బలోపేతం, వాణిజ్యం, పౌర అణు ఇంధన సహకారం వంటి అంశాలపై PM మోదీతో చర్చించనున్నారు. S-400, మిసైళ్ల కొనుగోలు, రూపే-మిర్ అనుసంధానం సహా 25 వరకు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అధునాతన S-500 వ్యవస్థ, SU-57 విమానాల కొనుగోలుపైనా చర్చలు జరపనున్నారు.


