News December 8, 2025

గద్వాల: ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి: ఎస్పీ

image

గద్వాల జిల్లాలో ఎన్నికలలో శాంతిభద్రతలే ప్రధానమని, ఓటర్లు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పక పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల వేళ గ్రామాలలో ఎలాంటి అలజడి సృష్టించినా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News December 9, 2025

అమరావతిలో రూపుదిద్దుకుంటున్న AIS సెక్రటరీల బంగ్లాలు

image

అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణ ఇప్పటికే అమరావతి ప్రాంతంలోని
రాయపూడి వద్ద నిర్మాణంలో ఉన్న AIS సెక్రటరీల బంగ్లాలు రూపుదిద్దుకోవడం. మొత్తం 90 బంగ్లాలు వస్తున్నాయి. వీటిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ వైపు రాత్రింబవళ్లు ఐకానిక్ టవర్ల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

News December 9, 2025

జనగామ: చెక్ పోస్టుల వద్ద నాఖాబందీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద నకాబంది, వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, న్యాయబద్దంగా సాగేందుకు ఈ తనిఖీలు చేపట్టామని డీసీపీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎస్‌పీ పండరీ చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2025

నాగార్జున సాగర్‌లో విదేశీ ప్రతినిధుల సందడి

image

హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు సోమవారం బుద్ధవనాన్ని సందర్శించారు. నాగార్జునుడి బౌద్ధతత్వం, బుద్ధవనం నిర్మాణశైలి, ప్రత్యేకతలపై పరిశోధకుడు శివనాగిరెడ్డి వారికి వివరించారు. అనంతరం ప్రతినిధులు సాగర్ జలాశయంలో పర్యాటక శాఖ లాంచీలో గంటన్నరసేపు విహరించి ప్రకృతి సోయగాలను ఆస్వాదించారు. అంతర్జాతీయ అతిధుల సందర్శనతో సాగర్ పర్యాటకరంగానికి ప్రాచుర్యం దక్కింది.