News February 26, 2026
గద్వాల కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా

జోగులాంబ గద్వాల జిల్లాకు కొత్త కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జనగామ జిల్లా కలెక్టర్‌గా సేవలందించిన ఆయన, ఇకపై గద్వాల జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ పనిచేసిన బి.ఎం.సంతోష్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో రిజ్వాన్‌ను ప్రభుత్వం నియమించింది.
Similar News
News March 6, 2026
ప్రకటన సరే.. అమలు సాధ్యమేనా?

16 ఏళ్లలోపు పిల్లలకు SMను నిషేధించే ఆలోచన బాగున్నా అమలులో సాంకేతిక సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏజ్ వెరిఫికేషన్ చేయడం కష్టమేనని, VPN వాడి లొకేషన్ మార్చి యాక్సెస్ చేయొచ్చని అంటున్నారు. ‘తప్పుడు వివరాలతో అకౌంట్లు తెరవడాన్ని ఆపడం కష్టమే. అయితే ప్రభుత్వం టెక్ సంస్థలపై కఠిన నిబంధనలు విధిస్తూ, తల్లిదండ్రులు ఇంట్లో పర్యవేక్షణ పెంచితే ఇది సాధ్యమవుతుంది’ అని అభిప్రాయపడుతున్నారు.
News March 6, 2026
JGL: నాన్న అని పిలవలేని బాల్యం.. గణపతి కుమారుడి భావోద్వేగ గాధ

ఒక విప్లవం వెనుక సిద్ధాంతాలు, ఒక ఉద్యమం వెనుక రాజకీయ లక్ష్యాలు ఉంటాయి. కానీ ఉద్యమాల నీడలో కుటుంబం, తండ్రి, తల్లి, పిల్లల మధ్య బంధం నిశ్శబ్దంగా బలి అవుతాయి. మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావుA/Sగణపతి కొడుకు శ్రీనివాసరావు విడుదల చేసిన ఒక భావోద్వేగపూరిత సందేశం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నాన్న అని పిలవలేని బాల్యం నుంచి ఒక్కసారి చూడాలనే ఆత్రుత వరకు ఉన్న అనుబంధాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
News March 6, 2026
టెన్త్ పరీక్షల కోసం పక్కాగా ఏర్పాట్లు: DEO

టెన్త్ పరీక్షల కోసం చిత్తూరు జిల్లాలో 129 కేంద్రాలు ఏర్పాటు చేశామని DEO రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 23,095 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. బాలురు 12,105 మంది, బాలికలు 10,990 మంది ఉన్నారు. హాల్ టికెట్ చూపించి RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.


