News March 1, 2026

గద్వాల: కాంగ్రెస్‌లో వర్గపోరు.. తారాస్థాయికి ‘గ్రూపు’ సెగలు!

image

జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు భగ్గుమంటోంది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోకపోవడంపై కేడర్‌లో అసహనం వ్యక్తమవుతోంది.

Similar News

News March 2, 2026

బాల్య వివాహాల నిర్మూలనకు ‘విముక్తి రథం’

image

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో బాల్య వివాహాల విముక్తి రథాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తుందని వారు తెలిపారు. ఆడపిల్లలను చదువు ద్వారా ప్రయోజకులను చేయాలని, చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేయవద్దని కోరారు.

News March 2, 2026

మార్చి 10న మెగా జాబ్ మేళా.. పోస్టర్ ఆవిష్కరణ

image

ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా సందర్భంగా వన్ టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 10న ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జరగనున్న ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీలు పాల్గొని 2000కుపైగా ఉద్యోగాలు కల్పించనున్నాయి. నిరుద్యోగ యువతీయువకులు గూగుల్ ఫారమ్ QR Code లింక్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

News March 2, 2026

శ్రీనగర్ బంద్.. అప్రమత్తమైన కేంద్రం

image

ఖమేనీ మృతికి నిరసనగా శ్రీనగర్‌లో షియా వర్గీయులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పరిణామంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా లక్నో, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రం కావడంతో.. షియా మత పెద్దల ప్రసంగాలపై నిఘా పెట్టాలని సూచించింది. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై పాక్షిక ఆంక్షలు విధించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలంది.