News December 2, 2025

గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

image

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె ‘X’ వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఇది ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.

Similar News

News December 5, 2025

చెరువు మట్టితో చాలా లాభాలున్నాయ్

image

చెరువులోని పూడిక మట్టిని పొలంలో వేస్తే భూమికి, పంటకు చాలా మేలు జరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరతాయి. వేసవిలో చెరువులు అడుగంటుతాయి. అప్పుడు చెరువు మట్టిని పొలాల్లో వేస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియ కర్భన పదార్థాలతో పాటు.. మొక్కల పెరుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నేలలో వృద్ధి చెందుతాయి.

News December 5, 2025

రంప: పాఠశాలలో ఆడుకుంటు..కుప్పకూలిన విద్యార్థిని

image

రంపచోడవరం మండలం తామరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థిని కె. జానుశ్రీ పాఠశాలలో తోటి విద్యార్థులతో ఆడుకుంటుండగా..ఫీట్స్‌ వచ్చి పడి పోయింది. బాలిక పేరెంట్స్, టీచర్స్ హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారరు.

News December 5, 2025

ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

image

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్స్ ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే బిస్పినాల్‌ ఏ (BPA) రసాయనం ఈస్ట్రోజన్‌, టెస్టోస్టిరాన్‌ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS సమస్యలు, టైప్‌ 2 డయాబెటిస్‌, నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.