News December 24, 2025
గద్వాల: కొనుగోలు కేంద్రంలో రైతు మృతి

గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని కలుకుంట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన రైతు జమ్మన్న(63) గుండెపోటుతో మృతి చెందారు. పంట విక్రయం కోసం నాలుగు రోజులుగా వేచి చూస్తున్న ఆయన, బుధవారం తూకం వేసే సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలారు. తోటి రైతులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ధాన్యం రాశుల వద్దే ప్రాణాలు వదలడం విషాదం నింపింది.
Similar News
News December 26, 2025
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ నరేశ్

బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సీహెచ్. నరేశ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. అనంతరం సంబంధితశాఖ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
News December 26, 2025
మరోసారి చెలరేగిన విరాట్ కోహ్లీ

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చూపించారు. బెంగళూరు వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడుతున్న కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఔటయ్యారు. అంతకుముందు కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. గత 6 లిస్ట్-A మ్యాచ్‌ల్లో వరుసగా 74*, 135, 102, 65*, 131, 77 పరుగులతో విరాట్ అదరగొట్టారు.
News December 26, 2025
శ్రీకాకుళం జిల్లా 104లో ఉద్యోగాలు

ప్రభుత్వం భవ్య ద్వారా నిర్వహిస్తున్న 104 చంద్రన్న సంచార చికిత్సలో భాగంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని శ్రీకాకుళం జిల్లా అధికారి నరసింహమూర్తి శుక్రవారం తెలిపారు. విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ఈనెల 27, 28 తేదీల్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


