News March 12, 2025
గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.
Similar News
News March 12, 2025
సంగారెడ్డి: పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్

జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి బుధవారం సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు అందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవో విద్యాసాగర్ పాల్గొన్నారు.
News March 12, 2025
పెద్దపల్లి: మీకోసం TGNPDCL మొబైల్ ఫోన్ యాప్: ఎస్ఈ

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి TGNPDCL మొబైల్ ఫోన్ యాప్‌ను రూపొందించిందని పెద్దపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ మాధవరావు పేర్కొన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం 20 ఫీచర్లతో కూడిన TGNPDCL డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004250028, 1912ని సంప్రదించాలని సూచించారు.
News March 12, 2025
వనపర్తి: ఇంటర్ పరీక్షలకు 150 మంది విద్యార్థులు గైర్హాజరు

వనపర్తి జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం బోటనీ, మాథ్స్, పొలిటికల్ సైన్స్ పరీక్షలకు 5,837 మంది విద్యార్థులు హాజరు కాగా, 150 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం పెద్దమందడి మండల కేంద్రంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు డీఐఈఓ పేర్కొన్నారు.