News March 26, 2025
గద్వాల: కోర్టు సముదాయానికి రూ.81కోట్లు మంజూరు

గద్వాల జిల్లాకు కొత్త సమీకృత కోర్టు సముదాయ భవనం మంజూరైందని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న న్యాయస్థానం నిర్మాణనికి రూ.81 కోట్ల నిధులు విడుదల అయినట్లు అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 29, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ కొత్తగూడెం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ✓ విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భద్రాచలంలో ఇల్లు దగ్ధం ✓ రాములోరి కళ్యాణానికి చేనేత పట్టు వస్త్రాలు తయారీ ✓ జూలూరుపాడు అంగన్వాడీ కేంద్రానికి తాళం ✓ చంద్రబాబు నా మాటలు వక్రీకరించారు: కూనంనేని ✓ భద్రాచలం: కందిరీగల దాడి.. మృతదేహాన్ని వదిలివెళ్లిన బంధువులు ✓ భద్రాచలం: జవాన్లే లక్ష్యంగా.. 45 కిలోల బాంబ్ బ్లాస్ట్ ప్లాన్.
News March 29, 2025
మేడ్చల్: మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన

మేడ్చల్ జిల్లాలో రేషన్ కార్డులను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అర్హులను ఎంపిక చేసి కార్డుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,23,938 కార్డులు ఉండగా 72,864 మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాక 85,885 మంది ప్రస్తుతం ఉన్న కార్డులోనే కొత్త పేర్లను నమోదు చేయాలని అప్లై చేశారు.
News March 29, 2025
Ghiblistyle: ఏపీ రాజకీయ నాయకుల ఫొటోలు ఇలా..

ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీలో ప్రవేశపెట్టిన యానిమేషన్ ఇమేజ్ ఫీచర్ Ghiblistyle సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. యూజర్లు తమకు నచ్చిన ఫొటోలను యానిమేషన్ స్టైల్‌లోకి మార్చుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైఎస్ జగన్ అభిమానులు సైతం ఆయన చిత్రాలను ghiblistyleలోకి మార్చి పోస్టులు చేస్తున్నారు.